జంతువుల్లోని మాతృప్రేమకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కరెంట్ తీగల మధ్య చిక్కుకున్న తన పిల్ల కోతిని కాపాడుకునేందుకు ఓ తల్లి కోతి చేసిన సాహసం నెటిజన్లను కదిలిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్ల కోసం ప్రాణాలకు తెగించి, అత్యంత చాకచక్యంగా దానిని రక్షించింది. ఈ తల్లి కోతి సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మనుషులకే కాదు, జంతువులకూ పేగు బంధం గొప్పదని ఈ ఘటన నిరూపించింది.