నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో దాదాపు రెండు వేల చాక్పీస్లతో శ్రీ వేంకటేశ్వర స్వామి నమూనా ఆలయాన్ని రూపొందించారు. మా గార్మెంట్ దుకాణం యజమాని మధుసూదన్ గౌడ్.. తమ దుకాణంలో పనిచేసే వాళ్లతో కలిసి దాదాపు 25 రోజుల పాటు శ్రమించి.. శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనా గుడిని నిర్మాణం చేపట్టారు. ఈ నమూనాలో పద్మావతి, గోదాదేవి అమ్మవార్లను కూడా తయారు చేశారు. భక్తిశ్రద్ధలతో, ఉపవాసాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నమూనాను నిర్మాణం చేపట్టామని మధుసూదన్ గౌడ్ తెలిపారు.