అనకాపల్లిలో గతంలో ఎన్నడూ చూడని విధంగా టోర్నడో తరహా సుడిగుండం బీభత్సం సృష్టించింది. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సుమారు 100 అడుగుల ఎత్తులో గాలి సుడులు తిరుగుతూ ఆకాశాన్ని తాకడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.