శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండలం కదిరేపల్లి గ్రామానికి చెందిన బోయ లక్ష్మీనారాయణ.. తన కూతురు విషయంలో న్యాయం జరగలేదంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన కుమార్తెకు సంబంధించిన వివాహ వివాదంలో పోలీసులు తనకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ సెల్టవర్పై నిరసనకు దిగాడు. కుమార్తె నుంచి విడాకులు తీసుకున్నా.. అల్లుడు మాత్రం బంగారం ఇవ్వకుండా సతాయిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా సరైన న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని కుటుంబసభ్యులు తెలిపారు.