మేడ్చల్ మల్కాజ్గిరి శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మరాసిపేటలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 20 తులాల బంగారం, 2 లక్షల నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్పేట్ పోలీసులు తెలిపారు. అయితే.. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో వరుస చోరీలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.