మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద 44వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ముందున్న డీసీఎంను ఢీకొట్టడంతో 31 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.