లింగంపల్లి రైల్వే స్టేషన్లో మాదాపూర్ SOT పోలీసులు నిర్వహించిన మెరుపు దాడిలో 35 కిలోల గంజాయి పట్టుబడింది. భువనేశ్వర్ నుంచి కొల్హాపూర్‌కు రైలులో గంజాయి తరలిస్తుండగా.. పక్కా సమాచారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న సదాశివ, రాహుల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను, గంజాయిని చందానగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.