మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దుండగులు తుపాకీతో హల్చల్ చేశాడు. నాగారం సత్యనారాయణ కాలనీలోని నగల దుకాణంలో.. నగల వ్యాపారిని తుపాకితో బెదిరించి దొంగతనానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే సదరు వ్యాపారిని తుపాకీతో గాయపరిచాడు. యజమాని అప్రమత్తం అవడంతో దుండగుడు తుపాకీని అక్కడే వదిలేసి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.