శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 12 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ వెల్లడించారు. పట్టణంలోని ఇంద్రనగర్కు చెందిన సాకే మల్లికార్జున, ముదిగుబ్బకు చెందిన మద్దినేని నాగరాజులను అదుపులోకి తీసుకోగా, మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరు పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వాహనాలను టార్గెట్ చేసి, సులువుగా దొంగలించి తక్కువ ధరలకే విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న వాహనాలు ధర్మవరం, హిందూపూర్, అనంతపురం ప్రాంతాలకు చెందినవిగా పోలీసులు గుర్తించారు.