మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఒక విదేశీ టూరిస్టు వీధుల్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. పోలీస్ బజార్ వద్ద ఆమె డ్యాన్స్ చేస్తుండగా, స్థానికులు ఆమె చుట్టూ ఒక రక్షణ వలయంలా ఏర్పడి ప్రోత్సహించారు. ఆమె స్వేచ్ఛకు భంగం కలగకుండా గౌరవప్రదంగా వ్యవహరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మహిళా డ్యాన్సర్‌ను గౌరవించిన తీరును కొనియాడారు. స్త్రీలను గౌరవించే షిల్లాంగ్ సంస్కృతిని ప్రదర్శించినట్లు కొందరు ప్రశంసించారు.