హైదరాబాద్ అంబర్‌పేటలోని చౌరస్తా వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రెనాల్ట్, మహేంద్ర షోరూంలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.