అస్సాంలోని మొరాన్ వద్ద జాతీయ రహదారి (NH-127)పై భారత వైమానిక దళం (IAF) యుద్ధ విమానాల ల్యాండింగ్ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈశాన్య భారత దేశంలోనే ఇది మొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF). ఫిబ్రవరి 14న ప్రధాని మోదీ దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు.