అంగవైకల్యం ఉన్నట్లు నటించి ప్రజలను మోసం చేస్తున్న ఒక నకిలీ భిక్షగాడి ఉదంతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డుపై కాళ్లు పడిపోయి, చేతులు వంకరపోయినట్లు నటిస్తూ జాలి కలిగించి అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అయితే, అతను మామూలుగా నడుచుకుంటూ వచ్చి, తన స్థావరం వద్ద చొక్కా విప్పి వికలాంగుడిలా మారిపోతున్న దృశ్యాలను ఒక వ్యక్తి రహస్యంగా వీడియో తీశారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.