బెంగళూరులో నమ్మక ద్రోహానికి పాల్పడి కిలాడీ దంపతులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. వంట మనిషి కమల, సెక్యూరిటీ గార్డు దినేశ్ మరో ఆరుగురితో కలిసి బిల్డర్ శివకుమార్ ఇంట్లో రూ.18 కోట్ల విలువైన సంపదను దోచుకున్నారు. ఇందులో 11.5 కిలోల బంగారం, వజ్రాలు, 5 కిలోల వెండి, రూ.11.5 లక్షల నగదు ఉన్నాయి. పనిలో చేరిన 20 రోజుల్లోనే యజమాని నమ్మకాన్ని పొంది.. ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.