శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరులో క్షుద్రపూజల కలకలం రేగింది. సిద్దార్ధ స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గులు, అందులో మనిషి ఆకారపు బొమ్మలు వేశారు. నిమ్మకాయలు, బొగ్గు, పసుపు, కుంకుమలతో క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు దర్శనమిచ్చాయి. అర్ధరాత్రి వేళ పూజలు నిర్వహించగా, స్థానికులు ఉదయం గమనించారు. పోలీసులకి సమాచారం ఇవ్వగా, విచారణ చేపట్టారు. గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.