రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. శాస్త్రిపురంలో అర్ధరాత్రి గంజాయి గ్యాంగ్.. స్థానికులపై దాడికి పాల్పడ్డారు. అడ్డువచ్చిన ఐదుగురు స్థానికులపై విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా పార్కింగ్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు. క్షతగాత్రులను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా... వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే గంజాయి బ్యాచ్ పారియేందుకు ప్రయత్నించగా.. స్థానికులు వెంబడించి వారిలో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.