రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ మెట్లో గాంజా బ్యాచ్ హల్చల్ చేసింది. గాంజా తాగిన మత్తులో.. ఓ యువకుడిపై కత్తితో దాడి చేశారు. వెంటనే స్థానికులు చూసి.. బాధితుడిని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. కత్తితో దాడి చేయడంతో పాటు.. బాధితుడి ఇంటి డోరుపై కూడా పెట్రోల్ పోసి నిప్పటించినట్లు స్థానికులు తెలిపారు. అయితే.. చింతల్మెట్ బస్తీలో గాంజా తాగుతున్నవారిని పలుసార్లు మందలించినప్పటికీ.. బస్తీవాసులపై కూడా దాడి చేసి బెదిరింపులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని పలువురుని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.