ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చినవెంకన్న సన్నిధిలో హుండీ లెక్కింపు వేళ కలకలం రేగింది. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తుండగా, ఇరగవరం మండలం సూరంపూడికి చెందిన సురేష్ అనే సేవకుడు చేతివాటం ప్రదర్శించాడు. సుమారు 59 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించి, ఎవరికీ అనుమానం రాకుండా తన అండర్వేర్లో దాచుకుని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అతని కదలికలను గమనించిన తోటి సేవకుడు అప్రమత్తమై వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించాడు. భద్రతా సిబ్బంది సురేష్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, దాచిన బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.