విజయనగరం జిల్లా రేగిడి మండలం కొండవలస గ్రామంలో వినూత్నంగా భోగి పండుగను నిర్వహించారు. అందరికీ గుర్తుండిపోయేలా అక్కడి యువత కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గ్రామస్తులతో కలిసి 15 మంది మహిళలు వారం రోజులుగా సుమారు నాలుగు కిలోమీటర్లు మేర భోగి పిడకలను దండలుగా తయారుచేసారు. భారీ పిడకల దండతో భోగి పండుగను గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సుమారు 12వేల అడుగులు ఉన్న ఈ భోగి పిడకల దండలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు భారీగా తరలివచ్చారు.