బాపట్ల జిల్లా వేమూరులో నూతనంగా నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ఐపీ విభాగాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేయకుండా, ప్రభుత్వ వైద్యశాలలోని అత్యాధునిక సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. వైద్యులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా అత్యవసర సమయాల్లో రోగులకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని, గత ప్రభుత్వం పునాదులు కూడా వేయని మెడికల్ కాలేజీలను ఇప్పుడు పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.