సంక్రాంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. 20వేల పిడకలతో వెయ్యి అడుగుల భారీ భోగి దండను తయారు చేశారు. ఆవు పేడతో తయారు చేసిన ఈ భోగి దండను రెడీ చేసేందుకు 20 రోజుల పాటు శ్రమించినట్లు విశ్వనాథరాజు కుటుంబం తెలిపింది. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేందుకు ఆరేళ్ల నుంచి ఈ రకంగా దండలను తయారు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇక గ్రామస్తులతో కలిసి ఈ దండను భోగి మంటల్లో వేశారు విశ్వనాథరాజు కుటుంబ సభ్యులు. ఆరేళ్ల క్రితం 400 అడుగులతో మొదలైన భోగి దండ.. ఇప్పుడు వెయ్యి అడుగులకు చేరింది.