Share News

శిరోజాలు ఒత్తుగా...

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:21 AM

శిరోజాలు నల్లగా, ఒత్తుగా పెరిగేందుకు ఖరీదైన సీరమ్స్‌, హెయిర్‌ ఆయిల్స్‌ వాడుతుంటారు. అయినా ఫలితం కనిపించక నిరాశపడేవారు ఈ చిట్కాలు పాటిస్తే సరి...

శిరోజాలు ఒత్తుగా...

శిరోజాలు నల్లగా, ఒత్తుగా పెరిగేందుకు ఖరీదైన సీరమ్స్‌, హెయిర్‌ ఆయిల్స్‌ వాడుతుంటారు. అయినా ఫలితం కనిపించక నిరాశపడేవారు ఈ చిట్కాలు పాటిస్తే సరి...

బ్యాక్‌ కోంబింగ్‌: తలను కిందికి వంచి శిరోజాలను ముందుకు వేసుకోవాలి. దువ్వెనతో మెడ వెనుక భాగంలోని కుదుళ్ల నుంచి ముందుకు దువ్వాలి. ఇలా నాలుగైదుసార్లు చేస్తే తలమీద చర్మం ఉత్తేజితమవుతుంది. దీంతో కుదుళ్లు బలపడి శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి.

మసాజ్‌: చేతుల్లోకి గోరువెచ్చటి కొబ్బరినూనెను తీసుకుని కుదుళ్ల దగ్గర తడుతూ తలంతా మర్దన చేయాలి. మధ్యమధ్యలో శిరోజాలను కుదుళ్లనుంచి నెమ్మదిగా కదిలిస్తుండాలి. దీనివల్ల పోషణ, తేమ అంది శిరోజాలు సహజంగా మెరుస్తాయి.

సర్వాంగాసనం: ఇది విలోమ యోగాసనం. దీనివల్ల తల భాగానికి రక్తప్రసరణ పెరిగి శిరోజాలు రాలడం తగ్గుతుంది. మాడుమీద చుండ్రు సమస్య తీరుతుంది. ఈ యోగాసనాన్ని క్రమం తప్పకుండా రెండు నెలలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

Updated Date - Nov 29 , 2026 | 04:23 AM