Share News

కొవిడ్‌ టీకా బాధితులకు నష్టపరిహారం

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:14 AM

కొవిడ్‌ టీకా తీసుకున్న అనంతరం తీవ్రమైన అనారోగ్యానికి గురైన, ప్రాణాల కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించే అంశంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

కొవిడ్‌ టీకా బాధితులకు నష్టపరిహారం

  • నో ఫాల్ట్‌ కంపన్సేషన్‌ విధానం రూపొందించాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, మార్చి 10 : కొవిడ్‌ టీకా తీసుకున్న అనంతరం తీవ్రమైన అనారోగ్యానికి గురైన, ప్రాణాల కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించే అంశంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫలానా వారి తప్పు లేదా నిర్లక్ష్యం వల్ల నష్టపోయామని బాధితులు నిరూపించుకోవాల్సిన అవనరం లేకుండా.. ప్రభుత్వం వారికి పరిహారం చెల్లించేలా ‘నో ఫాల్ట్‌ కంపన్సేషన్‌’’ విధానాన్ని రూపొందించాలని ఆదేశించింది. టీకాల వల్ల నష్టపోయిన కుటుంబాల వారు జవాబుదారీతనం కోసం చాలా క్రితం దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు మేరకు కేంద్రం ఓ విధానాన్ని రూపొందిస్తే. కొవిడ్‌ టీకా ప్రభావం వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సులువుగా నష్టపరిహారం అందుతుంది.

Updated Date - Mar 11 , 2026 | 04:14 AM