Share News

ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఖమేనీ భార్య మన్సూరే మృతి

ABN , Publish Date - Mar 02 , 2026 | 08:29 PM

అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ గత శనివారంనాడు తొలిసారి టెహ్రాన్‌పై జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే సోమవారంనాడు మరణించినట్టు ఆదేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది.

 ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఖమేనీ భార్య మన్సూరే మృతి
Khamenei and his wife Mansoureh Khojasteh

టెహ్రాన్: అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ గత శనివారంనాడు తొలిసారి టెహ్రాన్‌పై జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే సోమవారంనాడు మరణించినట్టు ఆదేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటికే ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనుమరాలు మృతి చెందారు. ఖమేనీ మృతితో ఇప్పటికే ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, మన్సూర్ ఖోజాస్తే కూడా మరణించడంతో టెహ్రాన్ నాయకత్వంపై ఒత్తిడి పెరిగి ఉద్రితకలు మరింత పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


సామాజ్రవాద శక్తుల దాడులను భీకరంగా తిప్పికొడతామని ఇప్పటకే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా అమెరికా మిత్రదేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాక్ వరుసదాడులు జరుపుతోంది. దీంతో తక్షణమే ఇరాన్ దాడులు ఆపాలంటూ 6 గల్ఫ్ దేశాలు సోమవారంనాడు ఒక సంయుక్త ప్రకటన చేశాయి. ఇరాన్ దాడులు ప్రాంతీయ భద్రతకు ముప్పగా పరణమించనున్నట్టు తెలిపాయి. యుద్ధం పొరుగుదేశాలతో కాదని, తెలివి తెచ్చుకోవాలని యూఏఓ హెచ్చరించగా, దాడులు ఆపకపోతే ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసునంటూ ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది.


లెబనాన్‌కు విస్తరించిన ఇజ్రాయెల్ దాడులు

కాగా, ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌తో పాటు లెబనాన్‌కు దాడులను విస్తరించింది. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ భూభాగంపై రాకెట్లు, డ్రోన్లతో దాడులకు పాల్పడటంతో ఇజ్రాయెల్ సైన్యం సైతం యుద్ధం దీర్ఘకాలం జరిగే అవకాశాలుంటాయని హెచ్చరించింది. సూయజ్ కాలువ గుండా జరిగే షిప్పింగ్‌ను కొన్ని కంపెనీలు ఇప్పటికే సస్పెండ్ చేశాయి. మధ్యప్రాచ్యంలోని పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. మరోవైపు, ఇరాన్‌లో యుద్ధం ఇరాక్ తరహాలోనే ముగింపు లేని యుద్ధం కావచ్చనే అభిప్రాయాలను అమెరికా రక్షణ కార్యదర్శి పీటె హెగ్సెత్ తోసిపుచ్చారు. ఇరాక్‌తో పోల్చవద్దని, ఇది ఎంతమాత్రం ముగింపలేని యుద్ధం కాదని, ఇరాన్ సైనిక శక్తిని ధ్వంసం చేసేందుకు చేపట్టిన నిర్ణయాత్మకమైన దాడి అని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ఇది ముగింపు లేని యుద్ధం కాదు: యూఎస్ మంత్రి పీటర్ హెగ్సెత్

పొరపాటున అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చిన కువైత్: పెంటగాన్

Updated Date - Mar 02 , 2026 | 11:36 PM