Share News

ముగ్గుర్ని నియమిస్తే.. ఒక్కరే అనుకూలం

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:23 AM

దిగుమతులపై భారీ సుంకాలను విధించడానికి ట్రంప్‌ ఈ చట్టాన్ని ఉపయోగించుకోవడాన్ని సవాల్‌ చేస్తూ.. ఈ టారి్‌ఫల వల్ల నష్టపోయిన వ్యాపారసంస్థలు, డెమొక్రాట్ల పాలనలో ఉన్న...

ముగ్గుర్ని నియమిస్తే.. ఒక్కరే అనుకూలం

  • తీర్పునిచ్చిన జడ్జీల్లో ముగ్గురు ట్రంప్‌ నియమించినవారే

దిగుమతులపై భారీ సుంకాలను విధించడానికి ట్రంప్‌ ఈ చట్టాన్ని ఉపయోగించుకోవడాన్ని సవాల్‌ చేస్తూ.. ఈ టారి్‌ఫల వల్ల నష్టపోయిన వ్యాపారసంస్థలు, డెమొక్రాట్ల పాలనలో ఉన్న 12 అమెరికా రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్‌ తన అధికార పరిధిని మించి ఈ చట్టాన్ని వాడారని, పన్నులు వేసే అధికారం అధ్యక్షుడికి లేదని దిగువ కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్‌ సర్కారు ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. సుప్రీం కూడా ఆ తీర్పును సమర్థించింది. ఈ తీర్పును వెలువరించిన ధర్మాసనంలో.. ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నియమించిన ముగ్గురు కన్జర్వేటివ్‌ జడ్జీలు ఉన్నారు. దీంతో తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని చాలా మంది భావించారు. ట్రంప్‌ కూడా.. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన కేసుల్లో ఒకటని.. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ అవుతుందని హెచ్చరించారు. కానీ, ఆ ముగ్గురు జడ్జీల్లో బ్రెట్‌ క్యావనావ్‌ మాత్రమే అనుకూలంగా తీర్పునివ్వగా.. మిగతా ఇద్దరూ (నీల్‌ గోర్సచ్‌, అమీ కోనీ బారెట్‌) ప్రతికూల తీర్పునిచ్చిన మెజారిటీ జడ్జీల్లో ఉన్నారు. జడ్జీలే కాదు.. రిపబ్లికన్‌ పార్టీకి ఎప్పుడూ మద్దతుగా ఉండే వ్యాపార అనుకూల బృందాలన్నీ ఈ విషయంలో ట్రంప్‌ను వ్యతిరేకిస్తుండడం గమనార్హం. టారి్‌ఫల వల్ల ధరలు కూడా పెరుగుతుండడంతో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది.

Updated Date - Feb 21 , 2026 | 02:23 AM