అమెరికా దాడి భయంతో బంకర్‌లోకి ఖమేనీ?
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:15 AM
అమెరికా సైనిక దళాల మోహరింపు నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బంకర్‌లోకి వెళ్లిపోయినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
న్యూఢిల్లీ, జనవరి 25: అమెరికా సైనిక దళాల మోహరింపు నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బంకర్‌లోకి వెళ్లిపోయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా ఏ క్షణమైనా దాడికి దిగవచ్చనే ఉద్దేశంతో సైన్యం ఆయనను టెహ్రాన్‌లోని అత్యంత సురక్షిత బంకర్‌లోకి తరలించిందని.. టెహ్రాన్‌లోని వివిధ ప్రాంతాలకు చేరుకోగలిగేలా సొరంగాలు ఆ బంకర్‌కు అనుసంధానమై ఉన్నాయని ఇరాన్‌లోని ప్రతిపక్ష న్యూస్ చానల్‌ను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనం ప్రచురించింది. ఖమేనీ తన మూడో కుమారుడు మసౌద్‌కు రోజువారీ వ్యవహారాల బాధ్యతలు అప్పగించారని.. ప్రభుత్వ నేతలు, అధికారులతో ఆయనే మాట్లాడుతున్నారని పేర్కొంది.