మేడ్ ఇన్ చైనా యుద్ధ ట్యాంకు పేలుడు.. ఇద్దరు బంగ్లాదేశీ సైనికుల మృతి
ABN , Publish Date - Sep 10 , 2026 | 09:08 AM
చైనాలో తయారైన ఓ యుద్ధ ట్యాంకు పేలడంతో లోపల ఉన్న ఇద్దరు బంగ్లాదేశీ సైనికులు మృతిచెందారు.
ఇంటర్నెట్ డెస్క్: చైనాలో తయారైన ఓ యుద్ధ ట్యాంకు పేలడంతో లోపల ఉన్న ఇద్దరు బంగ్లాదేశీ సైనికులు మృతిచెందారు. బంగ్లాదేశ్‌లోని ఛత్తోగ్రామ్‌లోని హథాజారీ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో బుధవారం ట్రెయినింగ్ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి కూడా గాయాలపాలయ్యారు. బాధితుడికి ఢాకాలోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చైనాలో తయారయ్యే ఈ టైప్-59 ట్యాంకులను బంగ్లాదేశ్ వినియోగిస్తోంది. ఘటనపై ఆర్మీ దర్యాప్తునకు ఆదేశించింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, సోవియట్ యూనియన్‌కు చెందిన టీ-54 ఆధారంగా చైనా ఈ యుద్ధ ట్యాంకులను డిజైన్ చేసింది. భారీ సంఖ్యలో ఈ యుద్ధ ట్యాంకులను బంగ్లాదేశ్ వినియోగిస్తోంది. 1972లో తొలిసారిగా వీటిని బంగ్లాదేశ్ ఆర్మీలో ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1990లు, 2000ల్లో ఈ ట్యాంకులను భారీ సంఖ్యలో చైనా నుంచి కొనుగోలు చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ వద్ద 174 టీ 59 ట్యాంకులు ఉన్నట్టు సమాచారం. వీటి డిజైన్ పాతపడటంతో చైనా పలుమార్లు కొత్త టెక్నాలజీని జోడించి ట్యాంకులను అప్డేట్ చేసింది. తాజా ప్రమాదం నేపథ్యంలో ఈ ట్యాంకుల భద్రతపై బంగ్లాదేశ్‌లో మరోసారి చర్చ మొదలైంది.
ఈ వార్తలనూ చదవండి:
ఆ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్
ఫిలిప్పీన్స్ పడవలో అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి