Share News

హైదరాబాద్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ ల్యాబ్‌

ABN , Publish Date - May 25 , 2026 | 04:54 AM

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ).. హైదరాబాద్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ ల్యాబ్‌ను...

హైదరాబాద్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ ల్యాబ్‌

చిన్న, మధ్య తరహా ప్రాక్టీషనర్ల కోసం ఏర్పాటు

ఐసీఏఐ ప్రెసిడెంట్‌ ప్రసన్న కుమార్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ).. హైదరాబాద్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. చిన్న, మధ్య తరహా ప్రాక్టీషనర్లకు సహయపడే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు ఐసీఏఐ ప్రెసిడెంట్‌ ప్రసన్న కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)లో ఏర్పాటు చేస్తున్న అధునాతన ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ ల్యాబ్‌ను వచ్చే 2-3 నెలల్లో ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. చిన్న, మధ్యతరహా చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సంస్థలకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ సామర్థ్యాలు లేకపోవడంతో అవి పెద్ద ఆడిటింగ్‌ పనుల్లో పాల్గొనలేకపోతున్నాయని, ఈ సమస్యను అధిగమించడానికి ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీన్ని పే అండ్‌ యూజ్‌ మోడల్‌లో తీసుకువస్తున్నామన్నారు.

5 లక్షల మంది సభ్యులు: ఐసీఏఐలో చిన్న, మధ్యతరహా ప్రాక్టీషనర్లు సహా ఐదు లక్షల మందికిపైగా సభ్యులున్నారు. ఇదిలా ఉండగా.. ప్రపంచ స్థాయి సంస్థలతో సమానంగా పోటీపడేలా స్వదేశీ భారీ అకౌంటింగ్‌ సంస్థలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఐసీఏఐ గ్లోబల్‌ నెట్‌వర్కింగ్‌ మార్గదర్శకాలను నోటిఫై చేసింది. దీనివల్ల దేశీయంగా భారీ చార్టర్డ్‌ అకౌంటింగ్‌ సంస్థలను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయింది.

ఇవి కూడా చదవండి..

అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..

ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే.

Updated Date - May 25 , 2026 | 04:54 AM