ఎక్కువ జీతాలు ఇవ్వలేం..!
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:39 AM
గోకినంపాడు సొసైటీ ఉద్యోగుల జీతాల చెల్లింపు నిలిపివేత, సంఘ కార్యాలయానికి త్రిసభ్య కమిటీ చైర్మన్ తాళాలు వేయడంపై సహకారశాఖ ఏలూరు డివిజనల్ రిజిస్ట్రార్ కె.సత్యవతి మంగళవారం విచా రణ జరిపారు.
ఇష్టమైతేనే తాళాలు ఇస్తాం..
ముదినేపల్లి, మార్చి 10(ఆంధ్రజ్యోతి):గోకినంపాడు సొసైటీ ఉద్యోగుల జీతాల చెల్లింపు నిలిపివేత, సంఘ కార్యాలయానికి త్రిసభ్య కమిటీ చైర్మన్ తాళాలు వేయడంపై సహకారశాఖ ఏలూరు డివిజనల్ రిజిస్ట్రార్ కె.సత్యవతి మంగళవారం విచా రణ జరిపారు. ఉద్యోగుల జీతాలను త్రిసభ్య కమిటీ నిలిపివేయడం, సంఘ కార్యాలయానికి తాళాలు వేయడంపై సొసైటీ సీఈవో పి శ్రీనివాసరావు, మరో ఉద్యోగి జిల్లా సహకార శాఖాధికారి, డీఆర్‌కు తెలియజేశారు. దీంతో డీఆర్ సత్యవతి గోకినంపాడు సొసైటీని సందర్శించి త్రిసభ్య కమిటీ చైర్మన్ వెనిగళ్ళ సురేష్, సభ్యుడు ముచ్చర్ల సూరిబాబు, సంఘంలో సభ్యుత్వం కలిగిన రైతులతో చర్చించారు.
సంఘ కార్యాలయానికి తాళాలు వేయడం సరికాదని, రైతులు ఇబ్బందులు పడతారని డీఆర్ తెలిపారు. జీతాల విషయంలో ఏర్పడిన వివాదాన్ని కమిటీ, ఉద్యోగులు సామరస్యంగా పరిష్కరించుకో వాలని సూచించారు. తమ సంఘ ఆదాయాన్ని బట్టి సీఈవోకు నెలకు రూ.30 వేలు మించి జీతం ఇవ్వలేమని, అందుకు అంగీకరిస్తూ లెటర్ ఇస్తేనే సంఘ కార్యాలయ తాళాలు సీఈవోకు ఇస్తామని త్రిసభ్య కమిటీ చైర్మన్ సురేష్ స్పష్టం చేశారు. జీవో ప్రకారం జీతాలు ఇవ్వలేమన్నారు. దీనిపై డీఆర్ సత్యవతి మాట్లాడుతూ సంఘ ఆదాయానికి అనుగు ణంగా జీతాలను నిర్ణయించుకోవాలని సూచించారు. సమస్యను పెంచుకోవద్దన్నారు. అనంతరం సంఘ కార్యాలయానికి వేసిన తాళాలను, తెరిచి గుమస్తాకు అప్పగించారు. జీతాలు విషయం ఇంకా కొలిక్కి రాలేదు. స్పష్టత వచ్చాక కార్యాలయ తాళాలు సీఈవోకు అప్పగించనున్నారు.