కుళ్లిన గుడ్లు, చికెన్ వేస్టే మేత!
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:32 AM
తాడేపల్లిగూడెం మండలం కొత్తూ రు, ఆరుగొలను గ్రామాల్లో అక్రమంగా చేపల చెరువులు నిర్వహిస్తూ చికెన్ షాపుల నుంచి వచ్చిన వ్యర్థాలు, కుళ్లిన గుడ్లు, అం దులోని పురుగు లతో బ్రెడ్‌గా వండి చేపల మేతగా వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అక్ర మార్కులు.
చేపల చెరువుల మాఫియా దందా..
ప్రజల ప్రాణాలతో చెలగాటం..
తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 10 (ఆం ధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం మండలం కొత్తూ రు, ఆరుగొలను గ్రామాల్లో అక్రమంగా చేపల చెరువులు నిర్వహిస్తూ చికెన్ షాపుల నుంచి వచ్చిన వ్యర్థాలు, కుళ్లిన గుడ్లు, అం దులోని పురుగు లతో బ్రెడ్‌గా వండి చేపల మేతగా వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అక్ర మార్కులు. ఒక పక్క అక్రమ చెరు వుల సాగు, మరోపక్క కలుషిత ఆహారం చేపల మేతగా వేస్తూ ప్రజా రోగ్యాన్ని పాడుచేస్తున్నారు. తాడేపల్లి గూడెం మండలం కొత్తూరు సచివాల యం వెనుక క్వారీల్లో ఓ పెంపకం దారుడు ట్రేల కొద్దీ కుళ్లిన గుడ్లు తెచ్చి పెనంపై వేసి కేకుల్లా తయారు చేస్తూ తన చెరువుల్లో వేయడంతో పాటు ఇతర చేపల చెరువులకు కూడా ఆ కేకులు సరఫరా చేస్తున్నాడని స్థానికు లు వాపోతున్నారు. ఆ వ్యక్తి సాగుచేస్తున్న చేపల చెరువు నిండా కుళ్లిన చికెన్ వ్యర్థాలు, ఆ చెరువు చుట్టూ కుళ్లిన గుడ్లు తారస పడుతుండటం కలవరం కలిగిస్తోంది.
పసర్లతో నిండిన చేపల చెరువులు !
పసర్లు పట్టిన నీటిలో ఇటు చికెన్ వేస్ట్, కోడిగుడ్ల కేకులు చేపలకు వేసి తక్కువ సమ యంలో చేపలు పెంచేందుకు ఈ తరహా అక్రమ ఆహారం అందిస్తూ చేపలను పెంచు తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారనే ఆరోప ణలు ఉన్నాయి. ఈ అక్రమార్కుల చర్యల వల్ల తక్కువ సమయంలో చేపలు పెరిగి వారికి మంచి ఆదాయం వస్తుండటంతో ఈ తరహా మాఫియా పెట్రేగిపోతోంది.
ప్రజారోగ్యానికి ముప్పు..
చికెన్ వేస్ట్‌తో తక్కువ సమయంలోనే చేపలు పెరుగుతుండటం వల్ల ఈ తరహా మేతను వేసేందుకు చేపల చెరువుల నిర్వాహ కులు ఆసక్తి చూపిస్తున్నారు. చికెన్ వ్యర్థా ల్లోని జీవాణువులు చేపల శరీరంలో పేరుకుని వాటిని తీన్న వారి రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. క్యాన్సర్, కాలేయ సమ స్యలు, నరాల సంబంధ వ్యాధులు వచ్చే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోడిగుడ్లతో వింత మేత..
కుళ్లిన కోడిగుడ్లతో చేపలు వేగంగా పెరిగే మేతను తయారు చేస్తూ చేపల చెరువుల మాఫియా చికెన్ వేస్ట్‌తోపాటు మరో అక్రమ మేతను తయారు చేస్తూ పర్యవరణాన్ని పాడుచేస్తూ ప్రజల ప్రాణాలతో ఆట లాడుతున్నారనే విమర్శలు వెల్లువె త్తుతున్నాయి.
అధికారులకు పట్టని ప్రజారోగ్యం..
ఇటు పర్యావరణం పాడుచేసేలా అక్రమ చేపల చెరువుల్లో ప్రజల ప్రాణాలు హరించే విదంగా చికెన్ వేస్ట్ వేస్తు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న వారిని కనీ సం గ్రామ స్థాయి అధికారులు గానీ, క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇలాంటి చర్యల ను నియం త్రించాల్సిన యంత్రాం గం పట్టనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
మాఫియాలా చికెన్ వేస్ట్ వ్యాపారం
పెద్ద పట్టణాలలో ఉండే చికెన్ దుకాణాల నుంచి చికెన్ వేస్ట్ సేకరించి వాటిని కొల్లేరు, తాడేపల్లిగూడెం, నల్లజర్ల ప్రాంతాల్లో సాగు చేసే చేపల చెరువులకు సరఫరా చేసే మాఫియా కోట్లలో వ్యాపారం సాగిస్తోంది. ముఖ్యంగా ఉంగుటూరు సమీపంలోని కోళ్ల ఫారాల నుంచి, పట్టణాల్లోని చికెన్ షాపుల నుంచి చికెన్ వేస్ట్ టన్నుల కొద్దీ సేకరిస్తూ మాఫియా రెచ్చిపోతోంది. తాడేపల్లిగూడెం, రావులపాలెం ప్రాంతాల్లో ఈ చికెన్ వేస్ట్ దందా సాగిస్తున్న వ్యాపారులు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలున్నాయి. రాత్రి సమయా ల్లో వ్యాన్‌లలో చికెన్ వేస్ట్ తరలిస్తూ చెరువులను చికెన్ వేస్ట్‌తో నింపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ తరహా వ్యాపారులు పోలీసులను మేనేజ్ చే స్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజారోగ్యంపై ప్రభావం
–నార్ని బావాజి, వైద్యుడు, తాడేపల్లిగూడెం
ఇప్పటికే ఆహారం అంతా కలుషితం అవుతోంది. చివరికి చికెన్ ప్రమాదకరంగా మారింది. చేపలకు చికెన్ వేస్ట్, కుళ్లిన గుడ్ల ఆహారంగా వేయడం ప్రమాదకరం. ఇప్ప టికే ఈ తరహా ఆహారం వల్ల ప్రజల ఆరో గ్యం క్షీణిస్తుంది. క్యాన్సర్, జీర్ణ సంబంధిత వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.