Share News

కొల్లేరుకు మంచిరోజులు

ABN , Publish Date - Jun 10 , 2026 | 01:11 AM

కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయడంతో 95 శాతం పూర్తయిందని సుప్రీంకోర్టు నుంచి త్వరలోనే అనుమతులు వస్తాయని ఎమ్మెల్యే డాక్టర్‌ కామి నేని శ్రీనివాస్‌ ధీమా వ్యక్తం చేశారు.

కొల్లేరుకు మంచిరోజులు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌

జిరాయితీ, సొసైటీ భూములిచ్చేందుకు

సీఈసీ కమిటీ ఆమోదం

ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌

కైకలూరు, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి):కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయడంతో 95 శాతం పూర్తయిందని సుప్రీంకోర్టు నుంచి త్వరలోనే అనుమతులు వస్తాయని ఎమ్మెల్యే డాక్టర్‌ కామి నేని శ్రీనివాస్‌ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కైకలూ రులో వడ్డి సాధికారిక సమితి కన్వీనర్‌ బలే ఏసురాజు అధ్య క్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌ మాట్లాడారు. కొల్లేటి పెద్దింట్లమ్మ సాక్షిగా కొల్లేరు సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నిరంతరంగా పోరాటం చేస్తున్నామన్నారు. జిరాయితీ, సొసైటీ భూములు 20 వేల ఎకరాలను ప్రజలకు పంచేందుకు కొల్లేరు సరస్సులోని 77,138 ఎకరాల నుంచి మినహాయించా లని రాష్ట్ర ప్రభుత్వం సీఈసీ కమిటీకి నివేదిక అందజేసింద న్నారు. 2025లో కొల్లేరులో పర్యటించిన సీఈసీ కమిటీ ఈ సిఫార్సులను ఆమోదించి సుప్రీంకోర్టుకు అందజేసేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. డీఫారం పట్టాలపై ప్రత్యేకంగా ఆలోచనలు చేస్తామన్నారు. ఉంగుటూరు మండలం పత్తేపు రం ప్రాంతంలోనూ కైకలూరు, మండవల్లి మండలాల్లో ఒక ప్రాంతంలోనూ భూములను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. మధ్య భాగంలో కొల్లేరు సరస్సు ఉండేలా చూస్తా మన్నారు. 120 జీవోలో ఉప్పుటేరు పరివాహక ప్రాంతాన్ని కలుపుతారని, డ్రైనేజీ వసతులను మెరుగుపరిచి వర్షాకాలంలో ముంపు ప్రభావం లేకుండా ఉండేందుకు కొల్లేరుకు ప్రత్యే కంగా మేనేజింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇప్పటికే పోలవరం కాలువ నుంచి గోదావరి జలాలను కొల్లేరు సరస్సు లోకి వచ్చేలా తమ్మిలేరు వద్ద స్లూయిస్‌ నిర్మాణానికి ముఖ్య మంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని త్వరలోనే దానిని పూర్తిచేసి కొల్లేరు సరస్సులో 5 అడుగుల మేర తీపి నీరు ఉండేలా చేస్తామన్నారు. కొల్లేరు ప్రజలకు మరింత జీవనో పాధి కల్పించేందుకు మకానా పంటలు పండించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కేంద్రప్రభుత్వానికి దీనివల్ల కలిగే లాభాలను, ప్రజలకు జరిగే మేలును వివరించా రని, త్వరలోనే మకానా సీడ్స్‌ అందించేందుకు చర్యలు తీసు కుంటామన్నారు. భూముల పంపిణీకి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. కొల్లేరు సమస్యపై అయ్యే ప్రతీ పైసా తానే సొంతంగా భరిస్తానన్నారు. ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, డివిజ నల్‌ ఫారెస్ట్‌ అధికారి త్రిముర్తులురెడ్డి, వడి కార్పొరేషన్‌ చైర్మన్‌ గంటసాల వెంకటలక్ష్మీ, టీడీపీ కన్వీనర్‌ వీరమల్లు నరసింహా రావు, కొల్లేరు సంఘ నాయకులు పాల్గొన్నారు.

కూటమి వచ్చాక చొరవ : జయమంగళ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొల్లేరు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసింది.. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో కలిసి ఢిల్లీ వెళుతున్నాం.. అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మరొక సారి కొల్లేరు అంశంపై చర్చిస్తామన్నారు.

నూరుశాతం సాధిస్తాం : పుట్టా మహేష్‌

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొల్లేరులో 20 వేల ఎకరాలు పంపిణీ చేసేందుకు సీఈసీ సుముఖత చూపింది. త్వరలోనే సుప్రీంకోర్టుకు ఈ నివేదిక అందజేస్తుంది నూరు శాతం కొల్లేరుకు శాశ్వత పరిష్కారం సాధిస్తామని వీడియో కాల్‌ ద్వారా వివరించారు.

Updated Date - Jun 10 , 2026 | 01:11 AM