Share News

వశిష్ఠలోకి డ్రెయినేజీలు

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:48 AM

నరసాపురంలో వశిష్ఠ గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది.

వశిష్ఠలోకి డ్రెయినేజీలు
స్మతివనం వద్ద గోదావరిలో కలుస్తున్న డ్రైనేజీ నీరు

నదీ జలాలు కలుషితం

మరో ఏడాదిలో పుష్కరాలు

ఆ సమయానికి సమస్యకు చెక్‌ పడేనా?

అడ్డుకట్టకు గతంలో ఎన్నో ప్రతిపాదనలు

నరసాపురం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): నరసాపురంలో వశిష్ఠ గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. కంపెనీలు విడిచిపెట్టే వ్యర్ధాలతో పాటు పట్టణంలోని డ్రైనేజీలు కూడా వశిష్ఠలోనే కలుస్తు న్నాయి. దశాబ్దాలుగా ఈ సమస్య కొనసాగుతున్నా అధికారులు మాత్రం డ్రైనేజీల మళ్లింపునకు ప్రతిపాదనలతోనే సరిపెడుతు న్నారు. తాజాగా పుష్కర పనులపై డిప్యూటీ సీఎం పవన్‌ రాజమండ్రిలో అధికారులతో సమీక్షిస్తూ గోదావరి కలుషితంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్ధానిక అధికారుల్లోనూ టెన్షన్‌ నెల కొంది. ఇప్పటికే ఈ సమస్యపై ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు లందాయి. ఈసారి పుష్కరాలను ప్రభుత్వం ఎంతో పటిష్టంగా నిర్వహిం చేందుకు సిద్ధమవుతోంది. స్నానాల రేవుల సమీపంలో డ్రైనేజీల నీళ్లు నదిలో కలవడం బహిర్గతమైతే చర్చనీయాంశమవు తుందనే ఆందోళన అధికార యంత్రాంగంలో నెలకొంది.

ఆరుచోట్ల డ్రైనేజీలు నేరుగా గోదావరిలో..

వశిష్ఠ నది బియ్యపుతిప్ప వద్ద సముద్రంలో కలుస్తోంది. పట్టణం నుంచి మండలం వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరి చాలాచోట్ల కలుషిత కోరల్లో చిక్కుకుంది. ప్రధానంగా పట్టణంలో ఆరుచోట్ల డ్రైనేజీలు నేరుగా గోదావరిలో కలుస్తున్నాయి. అందులో బుడితలరేవు, కుళాయి చెరువు, బాపు ఘాట్‌, కొండాలమ్మ గుడి, స్మృతివనం, పీచుపాలెం వద్ద మేజర్‌ డ్రైనేజీల ముఖ ద్వారాలు గోదావరిలోనే ఉన్నాయి. ఈ మూడు స్నానాల రేవులకు సమీపంలోనే ఉన్నాయి. గతంలో పుష్కరాల సమయంలోనూ ఈ సమస్య అంత పెద్దగా కనిపించలేదు. నేడు పట్టణం విస్తరించడంతో డ్రైనేజీలు కూడా పెరిగాయి. దీంతో ఈసారి వీటిని మూసివేయక పోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గతంలో ఈ డ్రైనేజీల మళ్లింపునకు అధికారులు ప్లాన్‌ చేశారు. గోదావరిలో కలవకుండా డ్రేనేజీల్లో కలిసేవిధంగా అన్ని మేజర్‌ డ్రైనేజీలను ఒకచోటకు తీసు కొచ్చేలా ప్రతిపాదనలు రెడీచేశారు. అయితే ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో అప్పట్లో ముందుకు సాగలేదు. ఏడాదిలో గోదా వరి పుష్కరాలు వస్తున్నాయి. కనీసం ఆ 12 రోజులైనా వీటి రూట్‌ను మళ్లిస్తే బాగుంటుందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.దీనిపై మునిసిపల్‌ డీఈ ప్రసాద్‌ మాట్లాడుతూ పురపాలకానికి స్టోరేజ్‌ ట్రీక్‌మెంట్‌ ప్లాంట్‌ మంజూరైంది. సుమారు రూ.10 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు వల్ల డ్రైనేజీల్లోని నీరు నదులు, కాల్వల్లోకి వెళ్లవు.నేరుగా ప్లాంట్‌కు వస్తాయి. అక్కడ శుద్ధయిన తరువాత బయటకు వెళతాయన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 12:48 AM