యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - May 25 , 2026 | 12:18 AM
మండల కేంద్రంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో కాదా గౌరీ (34) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.
రామభద్రపురం, మే 24 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో కాదా గౌరీ (34) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నా డు. ఎస్‌ఐ జ్ఞానప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన గౌరీ టైలరింగ్ పనులు చేస్తుండేవాడు. మద్యానికి బానిసై మతిస్థివి తం లేకుండా తిరుగుతుండేవాడు. ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్ ఉరి వేసుకున్నాడు. విషయం గమనించిన తల్లి ఈశ్వరమ్మ కేకలు వేసింది. స్థానికులు గౌరీని కిందకు దించారు. కొనఊపిరితో ఉన్న అతడిని 108 వాహనంలో మాడంగి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేను నమోదు చేశామన్నారు.