పట్టణాల్లో సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:09 AM
పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు.
సాలూరు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. మంగళవారం సాలూరు బైపాస్ రోడ్డులో బుడా ఆధ్వర్యంలో రూ.8.61 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ సాలూరు అభివృద్ధికి కొత్త ఊపిరి పోసే ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. దీని ద్వారా ప్రజలకు ప్రణాళికాబద్ధమైన నివాస వసతులు, రోడ్లు తాగునీటి సౌకర్యం, విద్యుత్, డ్రైనేజీ వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, అధికారులు పాల్గొన్నారు.