Share News

గంజాయి విక్రయదారుల అరెస్టు

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:13 AM

విజయనగరం రూరల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని కొండకరకాం గ్రామ శివారులో సోమవారం రాత్రి గంజాయి విక్రయి స్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండున్నర కిలోల గంజాయితో పాటు, నాలుగు మోటారుసైకిళ్లు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ తెలిపారు.

 గంజాయి విక్రయదారుల అరెస్టు

విజయనగరం, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): విజయనగరం రూరల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని కొండకరకాం గ్రామ శివారులో సోమవారం రాత్రి గంజాయి విక్రయి స్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండున్నర కిలోల గంజాయితో పాటు, నాలుగు మోటారుసైకిళ్లు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఆయన మంగళవారం స్థానిక విలేకర్లకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఎల్‌.కళ్యాణ్‌, కె.నాగరాజు, ఎం.సతీష్‌వర్మ, ఎం.సాయి వర్మ, వై.తిరుపతిదాలయ్య, కె.గణేష్‌, పి.అశోక్‌లు గంజాయి విక్రయిస్తున్నట్టు చెప్పారు. ఎల్‌.కల్యాణ్‌ అరకు నుంచి మూడు కిలోల గంజాయిని తీసుకువచ్చి కొంత నాగరాజుకు అమ్మగా.. నాగరాజు మిగతా ఐదుగురికి ప్యాకెట్‌ రూ.200 చొప్పున విక్రయించాడని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి.. నిందితులను రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Jun 10 , 2026 | 12:13 AM