చెట్టుపై పడిన పిడుగు
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:12 AM
తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేట గ్రామ శివారులో ఉన్న కల్లాల సమీపంలో కొబ్బరి చెట్టుపై మంగళవారం సాయంత్రం పిడుగు పడింది.
కొత్తవలస, జూన్ 9(ఆంధ్రజ్యోతి): తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేట గ్రామ శివారులో ఉన్న కల్లాల సమీపంలో కొబ్బరి చెట్టుపై మంగళవారం సాయంత్రం పిడుగు పడింది. దీంతో చెట్టు పక్కనే ఉన్న పశువుల శాల, గడ్డివాముకు మంటలు అంటుకున్నాయి. పశువుల శాలలో నిల్వ ఉంచిన రూ.20వేలు విలువైన దాణాతో పాటు సుమారు రూ.50వేలు విలువైన గడ్డివాము దగ్ధమయ్యిందని బాధితురాలు పోలమరశెట్టి పద్మజ్యోతి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికే పశువులశాల, గడ్డివాము కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్షా 50వేలు నష్టం జరిగిందని అంచనా వేశారు. తుమ్మికాపల్లి మాజీ సర్పంచ్ పిల్లా అప్పలరాజు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.