Share News

పంచాయతీల వర్గీకరణ

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:30 AM

గ్రామ స్థాయిలో పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థలో పలు మార్పులు తీసుకువస్తున్నది. జనాభా ఆధారంగా ఇంతవరకు మేజర్‌, మైనర్‌ పంచాయతీలు వుండగా... ఇకపై జనాభాతోపాటు ఆదాయం, విస్తీర్ణం ఆధారంగా పంచాయతీలను నాలుగు రకాలుగా... రూర్బన్‌, గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3గా వర్గీకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పంచాయతీల వర్గీకరణ

నాలుగు కేటగిరీలు విభజన

పదివేలకు పైబడి జనాభా, రూ.కోటికి మించి ఆదాయం ఉంటే రూర్బన్‌

ఈ కేటగిరీలో 13 పంచాయతీలు

మిగిలినవి మూడు గ్రేడ్లుగా వర్గీకరణ

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గ్రామ స్థాయిలో పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థలో పలు మార్పులు తీసుకువస్తున్నది. జనాభా ఆధారంగా ఇంతవరకు మేజర్‌, మైనర్‌ పంచాయతీలు వుండగా... ఇకపై జనాభాతోపాటు ఆదాయం, విస్తీర్ణం ఆధారంగా పంచాయతీలను నాలుగు రకాలుగా... రూర్బన్‌, గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3గా వర్గీకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

జనాభా పదివేలకు పైబడి వుండి, ఏటా కోటి రూపాయలకు మించి ఆదాయం వచ్చే పంచాయతీలను రూర్బన్‌గా ప్రకటించింది. మూడు వేలకు మించి, పది వేల లోపు జనాభా వుండి, రూ.30 లక్షలకు పైబడి వార్షిక ఆదాయం వున్న పంచాయతీలను గ్రేడ్‌-1గా, రెండు నుంచి మూడు వేల మధ్య జనాభా వున్న పంచాయతీలను గ్రేడ్‌-2గా, రెండు వేలకన్నా తక్కువ జనాభా వున్న పంచాయతీలను గ్రేడ్‌-3గా విభజించింది. జిల్లాలో ప్రస్తుతం 646 గ్రామ పంచాయతీలు వుండగా, వీటిలో 13 పంచాయతీలు మాత్రమే రూర్బన్‌ కేటగిరీలో వున్నాయి. మిగిలిన వాటిలో గ్రేడ్‌-1లో 112, గ్రేడ్‌-2లో 169, గ్రేడ్‌-3లో 352 పంచాయతీలు వున్నాయి. వర్గీకరణ తరువాత ఆయా గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపు, సిబ్బంది నియామకం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తగిన ప్రాధాన్యం ఇస్తారు.

రూర్బన్‌ పంచాయతీలు

మండల కేంద్రాలైన చోడవరం, కశింకోట, మాడుగుల, పాయకరావుపేట, సబ్బవరంతోపాటు అనకాపల్లి మండలం తుమ్మపాల, అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం, పూడిమడక, వైఎస్సార్‌ నగర్‌, పరవాడ మండలం ఇ.బోనంగి, తానాం, రాంబిల్లి మండలం లాలం కోడూరు, రావికమతం మండలం కొత్తకోట పంచాయతీలను రూర్బన్‌గా గుర్తించారు.

జిల్లాలో గ్రేడ్‌ల వారీగా పంచాయతీలు..

మండలం రూర్బన్‌ గ్రేడ్‌-1 గ్రేడ్‌-2 గ్రేడ్‌-3 మొత్తం

అనకాపల్లి 1 7 7 17 32

అచ్యుతాపురం 3 5 7 19 34

బుచ్చెయ్యపేట 0 3 10 22 35

చీడికాడ 0 4 6 13 23

చోడవరం 1 5 9 17 32

దేవరాపల్లి 0 1 12 14 27

గొలుగొండ 0 6 2 19 27

కె.కోటపాడు 0 4 6 22 32

కశింకోట 1 3 7 16 27

కోటవురట్ల ్ల 0 2 11 12 25

మాడుగుల 1 2 15 11 29

మాకవరపాలెం 0 7 3 21 31

మునగపాక 0 3 7 16 26

నక్కపల్లి 0 12 4 17 33

నర్సీపట్నం 0 2 3 7 12

నాతవరం 0 6 10 15 31

పరవాడ 2 6 5 2 15

పాయకరావుపేట 1 10 7 6 24

రాంబిల్లి 1 2 5 22 30

రావికమతం 1 5 9 13 28

రోలుగుంట 0 2 8 14 24

ఎస్‌.రాయవరం 0 9 8 11 28

సబ్బవరం 1 5 7 11 24

ఎలమంచిలి 0 1 1 15 17

మొత్తం 13 112 169 352 646

Updated Date - Mar 11 , 2026 | 12:30 AM