‘ఉషక్క’ రప్పా.. రప్పా.. నరకమంది!
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:46 AM
మనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా రప్పా.. రప్పా.. నరికేయమని ఉషక్క చెప్పిందంటూ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కోనాపురం గ్రామంలో...
వైసీపీ కార్యకర్త పోస్ట్
హిందూపురం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘మనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా రప్పా.. రప్పా.. నరికేయమని ఉషక్క చెప్పిందం’టూ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కోనాపురం గ్రామంలో వైసీపీ కార్యకర్త సురేశ్ కర్ర పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ ఆదివారం కోనాపురానికి వెళ్లారు. ఆమె కార్యక్రమం ముగించుకుని వెళ్లాక అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సురేశ్.. ఉషశ్రీ ఫ్లెక్సీ వద్ద నిలబడి, కర్ర పట్టుకుని బెదిరించాడు. ‘కోనాపురం గ్రామ ప్రజలకు నమస్కారం. నేను వైసీపీ కార్యకర్త సురేశ్‌ను. నాకు ఓటరు ఐడీ కార్డు కూడా ఉంది. ఉషక్క ఈరోజు ఊరికి వచ్చింది. మనకు ఆపోజిట్‌గా ఎవరు మాట్లాడినా రప్పా.. రప్పా.. నరికేయండని అక్క చెప్పింది. ఎవడొచ్చినా రప్పా.. రప్పా.. నరకడం పక్కా..’ అని రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.