రైతులకు ఇబ్బంది లేకుండా విత్తనాలు విక్రయించాలి
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:12 AM
ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరు వులు విక్రయించాలని వ్యవసాయశాఖ జేడీ వైవీ మురళీకృష్ణ అన్నారు.
జేడీఏ వైవీ మురళీకృష్ణ
రణస్థలం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరు వులు విక్రయించాలని వ్యవసాయశాఖ జేడీ వైవీ మురళీకృష్ణ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం రణస్థలం, లావేరు, జీసిరగడాం, పొందూరు మండలాల డీలర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ఐఎంఎస్, ఐఎఫ్ ఎమ్‌ఎస్ అనే యాప్‌ల ద్వారా యూరియా, డీఏపీ అమ్మకాలు చేయాలని సూచించారు. ఏపీఏఐఎంఎస్ యాప్‌లో ఏ రైతుకు ఎంత విస్తీర్ణం ఉన్నదో ఆ మేరకు ఎంత ఇవ్వాలన్న విషయం స్పష్టంగా ఉంటుందన్నారు. అదే సమయంలో ఐఎఫ్‌ఎంఎస్‌లో ఈ పాస్ మెషిన్ ద్వారా ఏ రైతుకి అమ్మారో వారికే డీబీటీ చేయా ల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ వి.శ్రీనివాసరావు, వ్యవసాయాధికారులు డి.విజయ భాస్కరావు, డి.మహేష్‌నాయుడు, బి.బాబ్జి, వై.రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.