కార్యకర్తలు క్రమశిక్షణతో ముందుకుసాగాలి
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:42 PM
టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణతో ముం దుకుసాగాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. గురువారం కొత్తరోడ్డు జంక్షన్‌లో క్లస్టర్ యూనిట్ ఇన్‌చార్జిలు, బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లకు సమావేశం నిర్వహించారు.
ఆమదాలవలస, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణతో ముం దుకుసాగాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. గురువారం కొత్తరోడ్డు జంక్షన్‌లో క్లస్టర్ యూనిట్ ఇన్‌చార్జిలు, బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లకు సమావేశం నిర్వహించారు. సందర్భంగా రవికుమార్ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభు త్వ సంక్షేమ పథకాలు అమలు, గ్రామాలు, వార్డుల స్థాయిలో ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై బూత్ స్థాయి నాయకులు అవగాహనకల్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర లీగల్‌సెల్ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృషనాయుడు, కళింగ కార్పొ రేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, ఎస్.ఢిల్లీశ్వరరావు, నాయకులు నూకరాజు, ఎస్.మాధవి, టి.గీత, రాజ్యలక్ష్మి, శ్రీదేవి, రాంబాబు, మురళీధర్‌యాదవ్, శంకర్ భాస్కర్, రామ్మోహన్, సిద్దార్ధ, సురేంద్ర పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం
పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. గురువారం పట్టణంలోని పారిశ్రామికవాడలో ఉన్న విజన్ కార్యాలయంలో నియోజకవర్గానికి మంజూరైన 51 మంది లబ్ధిదారులకు స్పౌజ్ పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత, మునిసిపల్ మాజీ చైర్మన్ తమ్మినేని గీత, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, నారాయణపురం ఆనకట్టు చైర్మన్ సనపల ఢిల్లీశ్వరరావు, నాయకులు సంపతిరావు మురళీ, సిమ్మ మాధవి, నాగళ్ల మురళీధర్‌యాదవ్ పాల్గొన్నారు.