Share News

ఆకాశవీధిలో విహారం

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:08 AM

Air balloon noise! రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా అధికారులు పర్యాటకుల కోసం సరికొత్త వినోదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. శ్రీకాకుళంలోని ఎనభై అడుగుల రోడ్డు వేదికగా ‘హాట్‌ ఎయిర్‌ బెలూన్‌’ ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఆకాశవీధిలో విహారం
శ్రీకాకుళం ఎనభై అడుగుల రోడ్‌లో బెలూన్‌ రైడ్‌ను తిలకిస్తున్న ప్రజలు

ఆదిత్యుని చెంత హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ సందడి!

ఎనభై అడుగుల రోడ్డులో ప్రారంభం

పర్యాటకులకు సరికొత్త అనుభూతి

శ్రీకాకుళం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా అధికారులు పర్యాటకుల కోసం సరికొత్త వినోదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. శ్రీకాకుళంలోని ఎనభై అడుగుల రోడ్డు వేదికగా ‘హాట్‌ ఎయిర్‌ బెలూన్‌’ ప్రయాణాన్ని ప్రారంభించారు. అరకుకు చెందిన మెగా ఈగల్‌ ఫ్లై సంస్థ ఆధ్వర్యంలో ఈ విహార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రెండు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో ఎనిమిది మంది విహరించేలా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఒక్కొక్కరికి టికెట్‌ ధర రూ. 999గా నిర్ణయించారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బెలూన్‌ విహారం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా అక్కడ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌ సౌకర్యాలను సిద్ధంగా ఉంచారు. భూమి నుంచి 200 అడుగుల ఎత్తున ఆకాశం నుంచి అరసవల్లి ఆలయ శోభను, నగర అందాలను వీక్షించేందుకు నగరవాసులు, భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

Updated Date - Jan 21 , 2026 | 12:08 AM