15 మంది బాలురకు విముక్తి
ABN , Publish Date - Jun 10 , 2026 | 01:06 AM
బిహార్ రాష్ట్రం నుంచి చెన్నైలో వివిధ ఫ్యాక్టరీల్లో కూలి పనులు చేసేందుకు వెళ్తున్న 15 మంది బాలలను గుర్తించిన అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. పిల్లలను తరలిస్తున్నారన్న సమాచారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా బాలల సంక్షేమ కమిటీ, ఒంగోలు జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు, షార్ట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, ఫర్ సోషల్ వలంటీర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఆరు గంట లకు జోక్‌బాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న రైలులో తనిఖీలు చేపట్టారు.
బిహార్ నుంచి చెన్నై వెళ్తుండగా గుర్తింపు
జేసీ ఎదుట హాజరుపర్చిన అధికారులు
అంబేడ్కర్ భవన్‌లో తాత్కాలిక వసతి
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 9(ఆంధ్రజ్యోతి): బిహార్ రాష్ట్రం నుంచి చెన్నైలో వివిధ ఫ్యాక్టరీల్లో కూలి పనులు చేసేందుకు వెళ్తున్న 15 మంది బాలలను గుర్తించిన అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. పిల్లలను తరలిస్తున్నారన్న సమాచారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా బాలల సంక్షేమ కమిటీ, ఒంగోలు జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు, షార్ట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, ఫర్ సోషల్ వలంటీర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఆరు గంట లకు జోక్‌బాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న రైలులో తనిఖీలు చేపట్టారు. 15 మంది బాలలను సంరక్షణలోకి తీసుకున్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి వద్ద హాజరుపర్చారు. బాలలను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. బిహార్ లోని ఏఏ జిల్లాల నుంచి వారు వచ్చారు, తల్లిదండ్రుల పరిస్థితులను తెలుసుకొని వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. తాత్కాలిక ఆశ్రయం కోసం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో వసతి కల్పించాలని సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మానాయక్‌ను జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నీలిమ, జిల్లా బాలల సంరక్షణ కమిటీ అధికారి దినేష్‌కుమార్, స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ సునీల్‌కుమార్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బీవీ సాగర్, శ్రీకాంత్, డాక్టర్ ప్రహసిత్ , శ్రీనివాసరావు, సుమన్ పాల్గొన్నారు.