మరో రెండు నెలలు మహాత్మా ఉపాధే
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:04 AM
రాష్ట్రంలో మరో రెండు నెలలపాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక(నరేగా) మే అమలుకానుంది.
జీ రామ్ జీ మార్గదర్శకాలు వచ్చేదాకా..!
17న రాష్ట్ర అఽధికారులతో కేంద్రం భేటీ
అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో రెండు నెలలపాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక(నరేగా) మే అమలుకానుంది. జీ రామ్‌జీ పథకం ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేస్తామని కేంద్రం ప్రకటించినా.. కొత్త పథకం మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయకపోవడంతో ఏప్రిల్, మే నెలల్లో కూడా ప్రస్తుత పథకాన్నే అమలు చేయాలని కేంద్రం సూచించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నరేగాకు రూ.30 వేల కోట్లు కేటాయించింది. ఇప్పటికే కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు రెండు నెలలపాటు లేబర్ బడ్జెట్‌ను కేంద్రం ప్రకటించింది. మన రాష్ట్రానికి చెందిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల 17న సమావేశం కానుంది. ఈ సమావేశంలో మన రాష్ట్రానికి సంబంధించి లేబర్ బడ్జెట్‌ను ప్రకటిస్తారని భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు మరో 2 నెలలపాటు వెసులుబాటు కలిగిందంటున్నారు.