ప్రభుత్వ స్థలాలు పార్టీలకు కేటాయిస్తారా?
ABN , Publish Date - May 09 , 2026 | 11:48 PM
ప్రభుత్వ కార్యాలయాల ముందు ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలను పార్టీ కార్యా లయాలకు ఇవ్వడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా కార్యదర్శి డి.గౌ్‌సదేశాయ్ అన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్
కర్నూలు న్యూసిటీ, మే 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల ముందు ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలను పార్టీ కార్యా లయాలకు ఇవ్వడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా కార్యదర్శి డి.గౌ్‌సదేశాయ్ అన్నారు. శనివారం సుందరయ్య భవనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిలువ నీడలేని పేదలు ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో సెంటు, అరసెంటును ఆక్రమించు కుని తలదాచుకునేందుకు ప్రయత్నాలు చేస్తే అధికారులు అడ్డుకుంటా రని అన్నారు. సి.క్యాంపు సెంటర్ వద్ద రూ.100 కోట్ల విలువ చేసే ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, కార్యాలయాన్ని ఖాళీ చేయించి లీజు పేరుతో టీడీపీ కార్యాలయం నిర్మాణం చేయడం అన్యాయమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే జలమండలి వద్ద ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని లీజు పేరుతో తీసుకుని ఏకంగా నిర్మాణాన్నే చేపట్టారన్నారు. ఈసమావే శంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎ్‌స.రాధాకృష్ణ, టి.రాముడు, ఎండీ ఆనంద్‌బాబు పాల్గొన్నారు.