బాధితులకు న్యాయం చేస్తాం
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:04 AM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చి ఫిర్యాదులపై విచారించి బాధితులకు న్యాయం చేస్తామని డీఐజీ, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
డీఐజీ, ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చి ఫిర్యాదులపై విచారించి బాధితులకు న్యాయం చేస్తామని డీఐజీ, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నగరంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. మొత్తం 93 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో కొన్ని.. ఫారెస్టు డిపార్టుమెంట్‌లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆదోని శ్రీనివాసనగర్ శెట్టి గుడి దగ్గర ఉన్న ఉపేంద్ర అలియాస్ శివ రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడని కల్లూరు మండలం హేమలత నగర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ పిర్యాదు చేశారు. ఒంగోలుకు చెందిన అశోక్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.4.22 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు మండలం దూపాడు గ్రామానికి చెందిన సుల్తాన్ ఫిర్యాదు చేశారు. తాకట్టు పెట్టిన 9 తులాల బంగారం బంగారాన్ని మహిళా ఉద్యోగిని తిరిగి ఇవ్వకుండా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాని కర్నూలుకు చెందిన అరుణ ఫిర్యాదు చేశారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో బ్యూటీషియన్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అనంతపురానికి చెందిన మహేశ్, రమేష్ రూ.2లక్షలు తీసుకుని మోసం చేశారనీ కర్నూలు చెందిన తేజశ్విని ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ హుశేన్‌పీరా, సీఐలు శివశంకర్, రామకృష్ణ, విజయలక్ష్మి పాల్గొన్నారు.