మైనింగ్ లీజ్‌కు ప్రజాభిప్రాయ సేకరణ
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:33 PM
మండల పరిధిలోని నాగలూ టి, పైపాలెం గ్రామల పరిధిలో మైనింగ్ ప్రదేశాన్ని మెస్సర్సు ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు పర్యావరణ అనుమతులపై బుధవారం జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో నాగజ్యోతి, పర్యావరణ పరిరక్షణ ఈఈ కిశోర్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
పర్యావరణ అనుమతులపై జేసీ ఆధ్వర్యంలో నిర్వహణ
మిడుతూరు, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని నాగలూ టి, పైపాలెం గ్రామల పరిధిలో మైనింగ్ ప్రదేశాన్ని మెస్సర్సు ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు పర్యావరణ అనుమతులపై బుధవారం జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో నాగజ్యోతి, పర్యావరణ పరిరక్షణ ఈఈ కిశోర్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మైనింగ్ లీజు కోసం సర్వే నెంబర్ 117లో 18.071 హెక్టార్ల విస్తీర్ణంలో సంవత్సరానికి 74,990 టన్నుల సామర్థ్యంకల మైనింగ్‌ను వినియోగించడానికి మెస్సర్సు ఇండోసోల్ సోలార్ సంస్థ మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు పర్యావరణవేత్తలు, స్థానిక గ్రామాల ప్రజలు, రైతులు, యువకులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. మైనింగ్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని, కంపెనీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరారు. గ్రామస్తులకు ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తామని సోలార్ సంస్థ హామీఇచ్చింది. జేసీ కార్తీక్ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ఏఈ రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్‌ఐ ఓబులేసు, మండల సర్వేయర్ కృష్ణుడు, వీఆర్‌వో సుందరరావు, ఉపమండల అధ్యక్షుడు నబి రసూల్ స్థానికులు పోలీసులు పాల్గొన్నారు.