Share News

పోటా పోటీగా..

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:49 PM

పట్టణంలోని టెక్కె మార్కెట్‌ యార్డు వేలం పోటాపోటీగా కొనసాగింది. మంగళవారం మార్కెట్‌ యార్డులో ఒకటి నుంచి పది గదులకు వేలం పాట జేడీ రామాజంనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు.

పోటా పోటీగా..
వేలం పాట నిర్వహిస్తున్న జేడీ రామాంజనేయులు

టెక్కె మార్కెట్‌ యార్డు గదుల వేలం

గణనీయంగా పెరిగిన ఆదాయం

నంద్యాల రూరల్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని టెక్కె మార్కెట్‌ యార్డు వేలం పోటాపోటీగా కొనసాగింది. మంగళవారం మార్కెట్‌ యార్డులో ఒకటి నుంచి పది గదులకు వేలం పాట జేడీ రామాజంనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలంలో మొత్తం 121మంది పాట దారులు పాల్గొన్నారు. వీరిలో ఎక్కువగా వైసీపీ నేతలే ఉండటం విశేషం. మొదటి నుంచి పాటదారులు ప్రస్తుతం నడుస్తున్న రేట్ల కంటే అధికంగా పాడడం అందరిని అశ్చర్యానికి గురిచేసింది. మొదటి గదిని ఏకంగా రూ.32,200 ఇమ్రాన్‌ఖాన్‌ దక్కించుకున్నారు. తక్కువగా 3వ గదిని రూ.23వేలకు సురేంద్రకు దక్కింది. అత్యధికంగా 10గది ఏకంగా రూ.51 వేలకు భూషన్‌రెడ్డి సొంతమైంది. మొదటి నుంచి వేలం పాట కూటమి, వైసీపీ నాయకులకు పోటా పోటీగా నడిచింది. చివరికి వైసీపీ నాయకులే గదులన్నీ దక్కించుకున్నట్లు సమాచారం. గోదాము వేలంలో 17మంది పాల్గొన్నారు. గతంలో రూ.36వేలు అద్దె చెల్లించేవారు. ప్రస్తుతం నిర్వహించిన వేలంపాటలో రూ.85వే లకు దక్కించుకున్నారు. వీటన్నింటికి కాలపరిమితి మూడేళ్లు ఉంటుందని జేడీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీఈ రఘురా మిరెడ్డి, మార్కెట్‌ యార్డు చైౖర్మన్‌ గుంటుపల్లి హరిబాబు, కార్యద ర్శి ఎఫ్‌ఏసీ శేషిరెడ్డి, మార్కెటింగ్‌ ఏడీ అబ్దుల్‌ రహ్మన్‌, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 11:49 PM