వాళ్లను బైండోవర్ చేయండి
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:54 PM
నాటు సారా తయారీ, విక్రయాల్లో పాత నేరస్థులను బీఎన్ ఎస్ నిబంధనల మేరకు బైండోవర్ చేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి అన్నారు.
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి
ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ సీఐలతో సమీక్ష
కర్నూలు అర్బన్, జూన్ 9(ఆంధ్రజ్యోతి): నాటు సారా తయారీ, విక్రయాల్లో పాత నేరస్థులను బీఎన్ ఎస్ నిబంధనల మేరకు బైండోవర్ చేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో నంద్యాల, కర్నూలు జిల్లాలో సీఐలతో అసిస్టెంట్ కమిషనర్ వి. హనుమం తరావు, సూపరింటెండెంట్ మచ్చా సుధీర్ బాబు, రవికు మార్‌లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ఎక్సైజ్ నేరాలను పటిష్టంగా నిరోఽఽఽధించే లక్ష్యంతో కర్నూలు జిల్లాలోని 110 నాటు సారా ప్రభావిత గ్రామాల్లోని సారాయి తయారీ, అమ్మకం, నేరాలకు పాల్పడుతూ ఇప్పడు పూర్తిగా మానివేసిన వారికి ఇతర మార్గాల్లో జీవనోపాధిని కల్పించాలని అన్నారు. పాత నేరస్థులను బైండోవర్ చేయడం ద్వారా సమ స్యను పరిష్కరించాలని అన్నారు. నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంద న్నారు. ఈ ప్రక్రియలో అవసరమైతే పీడీ చట్టం ప్రయోగిం చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏపీ సురక్ష యాప్ ద్వారానే మొత్తం మద్యం అమ్మకాలు జరిపేటట్లు పర్యవేక్షణ వేగవంతం చేయాలని అన్నారు. దుకాణాలు, బార్లు వ్యాపార పని వేళలను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. ప్రజలకు మద్యం సరఫరా, పంపిణీ నియంత్రణ, షాపుల వారిగా గత మే నెలలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన రెవిన్యూ, పెండింగ్ కేసుల అంశాలపై సుదీర్ఘంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో ఏఈఎస్‌లు రాజశేఖరగౌడ్, రామక్రిష్ణారెడ్డి, రెండు జిల్లాల సీఐలు పాల్గొన్నారు.