జేఎన్‌టీయూఏలో దివ్యాంగుల బిజినెస్ ఐసీ
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:11 AM
దేశంలోనే మొట్టమొదటి దివ్యాంగుల బిజినెస్ ఇంక్యుబేటర్ సెంటర్(ఐసీ)ను అనంతపురం జేఎన్‌టీయూలో ఏర్పాటు చేశారు.
దేశంలోనే తొలిసారి స్టార్టప్స్ ప్రారంభించేలా శిక్షణ
అనంతపురం ఉన్నత విద్య, మార్చి 10(ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొట్టమొదటి దివ్యాంగుల బిజినెస్ ఇంక్యుబేటర్ సెంటర్(ఐసీ)ను అనంతపురం జేఎన్‌టీయూలో ఏర్పాటు చేశారు. ఇక్కడి రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) దివ్యాంగుల వ్యవస్థాపక శిక్షణ అభివృద్ధి కార్యక్రమంలో (ఈఎ్‌సడీపీ) భాగంగా ఏపీ దివ్యాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణస్వామితో కలిసి జేఎన్‌టీయూఏ వీసీ సుదర్శనరావు మంగళవారం ఇంక్యుబేటర్ సెంటర్‌ను ప్రారంభించారు. వ్యాపార రంగంలో రాణించాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ హబ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆర్‌టీఐహెచ్ సీఈఓ హఫీజ్ బాషా, ఎస్కేయూ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ చంద్రమౌళి,దివ్యాంగుల సంక్షేమశాఖ ఏడీ అర్చన పాల్గొన్నారు.