దళిత క్రైస్తవులు, ముస్లింలను ఎస్సీలుగా గుర్తించాలి
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:13 AM
దళిత క్రైస్తవులను, దళిత ముస్లింలను ఎస్సీలుగా గుర్తించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. దేశంలోని దళితులు మతం మారినంత మాత్రాన వారి కులం మారినట్టు కాదన్నారు.
దళిత జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
న్యూఢిల్లీ, జూన్ 8(ఆంధ్రజ్యోతి): దళిత క్రైస్తవులను, దళిత ముస్లింలను ఎస్సీలుగా గుర్తించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. దేశంలోని దళితులు మతం మారినంత మాత్రాన వారి కులం మారినట్టు కాదన్నారు. దేశంలో మత స్వేచ్ఛను కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. క్రైస్తవంలోకి వెళ్లిన దళితులను, ఇస్లాంలోని దూదేకుల, నూర్‌భాషా తదితర దళితులను ఎస్సీలుగా కొనసాగించకపోతే భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దళిత క్రైస్తవులను, ముస్లింలను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ జాతీయ దళిత జేఏసీ సోమవారం ఢిల్లీ ఏపీ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ డీన్, ఫ్యాకల్టీ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, ఆలిండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు డాక్టర్ షేక్ ఇస్లాముద్దీన్ తదితరులు హాజరయ్యారు.